Wednesday, March 24, 2010

పిల్లల కోసం పెద్దల కవిత్వం

పిల్లల కోసం పెద్దల కవిత్వం


(పచ్చిమ గోదావరి జిల్లా ,పెదపాడు మండలం,కోర్లమ్మకుంట ,ఎం.పి.పి .స్కూలు వార్షికోత్సవం లో చెప్పిన స్వీయ కవిత-తేది: 18.03.2010)


"మేమంతా..."

                 -శ్రీ 'కాట్రగడ్డ' 


పిల్లలం !పిల్లలం !పిల్లలం !
అక్షరాలూ నేర్చుకొనే ఎల్లలం !ఎవరి పిల్లలం!
అందమైన పిల్లలం !మంచి మనసు మల్లెలం!
పిల్లలం! పిల్లలం!మేమంతా బడి  పిల్లలం!

            కనుల చూసి-చెవుల వినగా 
             తెలుగు భాష శిక్షితులం ;
            మొక్కలపై మక్కువతో 
            విత్తనాలు వెదజల్లే రక్షకులం!

అమ్మ,నాన్న ,ప్రేమాలోదుగు
మాటలుగా-పాటలుగా,
అక్షరాలూ నేర్చి కూర్చి
పోటిపడి ఆటలాడు పిల్లలం!! 

             లక్షణ గురువులకై శిష్యులం!
             బాలురకు,బాలికలకు స్నేహితులం!
             మాబడిలో మార్మోగే నవ్వులం;
             గుడిలాంటి మా బడి లో దివ్వెలం!!

మేమంతా తెలుగు తల్లి పిల్లలం 
తెలుగు దేశ నలుదిక్కుల 
మారడుగు లేయ ఎదుగుచున్న
చదువులమ్మ పోషణలో పిల్లలం!

              పిల్లలం! పిల్లలం! పిల్లలం!
              ఆంధ్రాక్ష రాల హారతులిడు  పిల్లలం!
              అందమైన గ్రామాన భారతీయ ముల్లెలం!
              పిల్లలం! పిల్లలం!మేమంతా బడి  పిల్లలం!


********         ********        ******** 


              బాలల్లారా...


            శ్రీ  గుడిసేవ విష్ణు ప్రసాద్ ,ది.   24.03.2010 

బాలల్లారా  మీరు బాగుగా చదువుచు 
మంచి నడవడి కను మాసాలు కొనిన 
జగతి  మెచ్చు మీకు జయము కలుగుచుండు 
'బాల కళ 'కు కవిత పంప రండి 

**********           *************



           రంగులు !రంగులు!!

                                     -తాతా రమేశ్ బాబు 



రంగులు రంగులు రంగులు 
రా  చిలకా వేసెద రంగులు 
ముక్కుకు  ఎరుపు  రెక్కకు పచ్చా 
చక్కగా  నేను పూసెద రంగులు!! 


                రంగులు రంగులు రంగులు 
                ఓ కాకి పూసెద రంగులు 
                అంతా నలుపూ  కళ్ళే తెలుపూ 
                చిక్కగా రంగులు పులిమెద  నీకు !! 
రంగులు రంగులు రంగులు 
ఇడుగిడిగో బుదుగూ గాడు
చొక్కా లేదుగా  లాగూ నలుపు 
తప్పవు నీకు రంగులు నేడు!!


                 రంగులు రంగులు రంగులు 
                 పుస్తకాలలో బొమ్మలు గీసి 
                 గీసిన బొమ్మకు రంగులు వేసి 
                 చిత్రకారుడను ఆవుదును తప్పక !!


**********         **********


           అక్షర మాల 

                   -గంటా సాధు సుభాకర రావు , సెల్:9248175140
                        హెచ్ .ఎం .,ఎం.పి.పి.స్కూల్ ,
                        సేరిదగ్గుమిల్లి .గుడ్లవల్లేరు మండలం 





  
మ్మ పెట్టిన తాయిలంతో 
నందంగా బడి కెళ్ళాను 
క్కడ అక్కడ 
లలు వేస్తూ 
రకలు వేస్తూ 
యల ఉడతల కథలే వింటూ 
ణమో పణమో ఏమీ తెలియక
ఋ   అని దీర్ఘం తీస్తూ 
రుపు,నలుపు,పసుపు ,తెలుపు 
డు రంగుల ఆటలు ఆడి
దు ఆరు ఒకట్లు చెప్పి 
ప్పుల కుప్ప ఆటలు ఆడి 
డల ఒంటెల కథలే వింటూ 
రా   అని ఆశ్చర్యం తో 
ఆం తా ఎంతో సంతోషించి 
ఆః  అంటూ మురిసిపోయాము 
లము కావాలని మారాం  చేస్తే 
ర్జురపు పండు నాన్నే ఇస్తే 
బగబా తిని నే 
ణ ఘణ ఘణ ఘణ గంటలు మోగగా 
జ్ఞ  అంటూ దీర్ఘం తీస్తూ 
క చక బడికి 
లో అంటూ 
తగా కూడి
మ్మని పోయి
ఇణి మాస్టారు రాస్తే 
క్కున నేను 
పామని శబ్దం చేశా 
ప్పుల మోతల్లె 
మాల్  డమాల్ అని గ 
గణ గంట మొగంగా 
లుపు తోసుకుని 
పా తపాయని 
బ్బున నేను
న ధన చప్పుడు 
డకల
రుగుల పసందులతో
స్టున నేను 
యటకు వెళ్లి 
లే భలే 
న మంచి బడి 
ని 
య్యిన నేను 
య గా జతగా 
డివడి గా బయటకు వెళ్లి  మా బడికి 
లవు   వద్దు గిలవూ వద్దని సంతో 
ముగా గంతులు వేసి 
రదాగా ఆటలు ఆడి 
మ్మని హుమ్మని గ
మెత్తి అ 
క్షర దీపం నాలోవెలగగా 
య్యిన నేను ఇంటికి పోయా ! 
(ది. 04 .04 .2010 )


**********          ***********
శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ రచన 
ది .05 .04 .2010


 

తల్లి జిజియా భాయి తనయ శివాజీ కి 
మంచి మంచి కథలు చెప్పి 
దేశభక్తి నేర్పి దేశాన్ని రక్షించే 
అట్టి తల్లి నీకు అవసరమ్ము 


**********            ***********


2 comments:

  1. రమేష్ గారు ముందు గా మీకు నా నమస్కారా లు.పిల్లల గురుంచి ఒక బ్లా గు చేయాలి అనే మీ ఆలోచన ప్రశంశనీయం.మీరు రాసిన అక్షరమాల నాకు బాగా నచ్చింది.పిల్లల కు సులువు గా అర్ధం చేసుకొనే లా వుంది.

    ReplyDelete
  2. దేవి గారూ,
    మేలుపొద్దులు. మీ లాంటి వారి సమష్టి కృషి తో బాలకళ ను అభివృద్ది చేయాలను కుంటున్నాను .మీరు కుడా మీకు తెలిసిన చిన్నారుల సృజనలను నాకు మెయిల్ చేయండి . 'అక్షరమాల ' రాసింది నేను కాదు . రాసిన వారి పేరు అక్కడే వుంది .మరల చూడగలరు. వారు మంచి కవి,ఉపాద్యాయుడు కుడా.....
    మప్పిదాలతో ......

    ReplyDelete